గణేశుడి మండపం దగ్గర రక్తదానం

గణేశుడి మండపం దగ్గర రక్తదానం

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం డివిజన్ సంజయ్​గాంధీ నగర్​లో గణేశ్​మహరాజ్ అసోసియేషన్​ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర  ఆదివారం ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దీన్ని  మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్​ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా 50 మంది యువకులు రక్తదానం చేశారు. 10 మంది పేద విద్యార్థులకు చదువుల కోసం రూ.50 వేలు  అందజేశారు. రాములు, రాఘవేంద్రగౌడ్, పెద్ద అరుణ్​కుమార్, అనిల్​కుమార్, హనుమంతరావు పాల్గొన్నారు.