ఆర్థిక వ్యవస్థ బాగుపడితే పురుషులకు కూడా ఫ్రీ బస్సు : ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారి

ఆర్థిక వ్యవస్థ బాగుపడితే పురుషులకు కూడా  ఫ్రీ బస్సు : ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారి

కర్ణాటక  రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేరుస్తూ, ప్రజలకు ప్రయోజనాలను అందిస్తుంది. అయితే  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాని కర్ణాటక  ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే, పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి తాజాగా పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి ఈ విషయం పై మళ్ళీ  తనని కోపగించుకోవచ్చు అని హాస్యంగా అంటూ, ఈ విషయాన్ని ప్రత్యేకంగా రాయొద్దని ఆయన మీడియాను కోరారు. 

అయితే యలబుర్గా తాలూకాలోని హిరే వంకలకుంట గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో అయన మాట్లాడుతూ మనం అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడల్లా మీడియా అన్ని రకాల విషయాలను గుర్తు చేస్తూ ప్రచురిస్తుంది. నేను ఎప్పుడూ మాట మార్చి  మాట్లాడను, నేరుగానే  మాట్లాడతాను అని అన్నారు.  

ప్రభుత్వం మహిళలకు గృహ లక్ష్మి పథకం కింద ప్రతినెల ఆర్ధిక సహాయం అందిస్తుండగా,  అలాగే గ్రామాలలో  కూడా మంచి రోడ్లు నిర్మించాలని ఒక రైతు తనకు చెప్పిన మాటలను ఆయన  గుర్తు చేసారు. అప్పుడు నేను నవ్వుతు హామీ పథకాలను మూసేయాలని అన్నాను దింతో అది కూడా పెద్ద వార్తగా మారింది అని ఆయన అన్నారు.

గ్రామస్తులు హామీ పథకాల ప్రయోజనాలను నిరాకరిస్తే  గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించవచ్చు, అభివృద్ధి పనులు కూడా చేపట్టవచ్చని ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయారెడ్డి  అన్నారు. 

మొదట్లో నవ్వుతు చెప్పానని సమర్థించుకోవడానికి ప్రయత్నించిన, హామీల పథకాలకు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తుందని ఎత్తి చూపారు.  రాయవానికిలోని ఒక స్కూల్ కార్యక్రమంలో బసవరాజ్  రాయారెడ్డి పాల్గొనగా, గ్రామస్తులు పక్క రోడ్లు డిమాండ్ చేయడంతో ఇలా అన్నారు.