నిర్మల్ లో డిసెంబర్ 20న ఉచిత గుండె వైద్య శిబిరం

నిర్మల్ లో డిసెంబర్ 20న ఉచిత గుండె వైద్య శిబిరం

నిర్మల్, వెలుగు : 18 ఏండ్లలోపు పిల్లలకు ఈనెల 20న ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శిని నగర్ లో గల ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చిన్న పిల్లలకు ఉచిత గుండె వైద్య చికిత్స శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గుండె వ్యాధికి సంబంధించిన లక్షణాలున్న పిల్లలు, ముఖ్యంగా ఎదుగుదల లోపం, బరువు పెరుగుదల, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం, అలసట, గుండె జబ్బులు ఉన్నవారికి వైద్య పరీక్షలు చేయనున్నట్లు వివరించారు.  శనివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వైద్య శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.