2026లో కార్ల సందడి: ADAS టెక్నాలజీతో రాబోతున్న 3 బెస్ట్ సెడాన్ కార్లు ఇవే !

2026లో కార్ల సందడి: ADAS టెక్నాలజీతో రాబోతున్న 3  బెస్ట్  సెడాన్ కార్లు ఇవే !

మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది(2026) రాబోతోంది. దొంతో కొత్త ఏడాది కోసం కార్ల కంపెనీలు కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇండియాలో SUV కార్లకు ఎంత డిమాండ్ ఉన్నా, సెడాన్ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. సెడాన్ కార్లు సౌకర్యంగా, విలాసవంతమైన ఇంటీరియర్‌లతో, ఎక్కువ స్థలంతో మంచి మైలేజ్‌తో ఉంటాయి. అందుకే చాలా మంది సెడాన్ కార్లను కొనేందుకు  ఇష్టపడతారు.

ప్రముఖ కార్ల కంపెనీలైన హ్యుందాయ్, స్కోడా, వోక్స్‌వ్యాగన్ వచ్చే ఏడాది  మూడు ఫెమస్ సెడాన్ కార్లను కొత్త మోడళ్లలో విడుదల చేయబోతున్నాయి. ఈ మూడు సెడాన్ కార్ల గురించి తెలుసుకుందాం.... 

1. 2026 వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్: 2026 మొదటి మూడు నెలల్లో అంటే జనవరి - మార్చి మధ్య లాంచ్ కానుంది. ఈ కారులో లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) టెక్నాలజీని తీసుకురాబోతున్నారు. దీని ద్వారా కారు ఆటోమేటిక్‌గా దూరాన్ని అంచనా వేసి కంట్రోల్ చేయడం, దారి తప్పకుండా చూసుకోవడం వంటి  కొత్త సేఫ్టీ  ఫీచర్లు ఉంటాయి.

పాత మోడల్ లో ఉన్న 1.0-లీటర్ & 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌లే ఉంటాయి. కానీ కొత్త ఫీచర్ల కారణంగా ప్రస్తుత మోడల్ కంటే ఎక్కువ ధర ఉండే అవకాశం ఉంది. ఈ కారు హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా వంటి కార్లతో పోటీగా తీసుకొస్తుంది. 

2. 2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్: ఈ కారు వచ్చే ఏడాది (2026) లో లాంచ్ అవుతుందని అంచనా. కారు ముందు భాగంలో కొద్దిగా మార్పులు చేయవచ్చు. గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్‌ను కొంచెం కొత్తగా డిజైన్ చేయవచ్చు.

ఈ కారు లోపల అతిపెద్ద మార్పు ఏమిటంటే, రెండు 12.3-అంగుళాల స్క్రీన్లను తీసుకురాబోతున్నారు. ఒకటి డ్రైవర్ ముందు డిజిటల్ స్క్రీన్ కోసం, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (సంగీతం, నావిగేషన్ మొదలైన వాటి కోసం) కోసం ఉంటుంది. కారుకు కొత్త స్టీరింగ్ వీల్ కూడా లభిస్తుంది.
 
 పాత మోడల్ లో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లతో (సాధారణ & టర్బోచార్జ్డ్) మాన్యువల్ ఇంకా  ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అలాగే కొనసాగుతాయి.

3. 2026 స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్: ఈ కారు జనవరి 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కారు ముందు భాగంలో ఈసారి గొప్ప  మార్పులు ఉంటాయి. కొత్త అల్లాయ్ వీల్స్ (టైర్ల రిమ్స్), కొత్త LED టెయిల్‌ల్యాంప్స్ (బ్యాక్ లైట్లు) క్లస్టర్‌ను కూడా అందించవచ్చు.

 ఈ కారులో ADAS టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు లభించవచ్చు. అయితే, దీనికి పనోరమిక్ సన్‌రూఫ్ (పైకప్పు గాజు) ఉండకపోవచ్చు.

అయితే ఇంజిన్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంకా 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌లు ఉంటాయి. ఈ కొత్త ఫీచర్ల కారణంగా ప్రస్తుత మోడల్ కంటే కొంచెం కాస్ట్లీ ఉండవచ్చు.