డబ్బుల వ్యవహారంలో వివాదం..ఇద్దరి పరిస్థితి విషమం

డబ్బుల వ్యవహారంలో వివాదం..ఇద్దరి పరిస్థితి విషమం

హైదరాబాద్ గచ్చిబౌలిలో  డబ్బుల వ్యవహారంలో ఓ కంటెస్టెంట్ కార్పొరేటర్ తమ్ముడు రెచ్చిపోయాడు. మసీదు బండలో ముబిన్ , జిలాని ఇద్దరని చితకబాదాడు. విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు.