కాళేశ్వరం టెంపుల్​లో సరోజ వివేక్ పూజలు

కాళేశ్వరం టెంపుల్​లో సరోజ వివేక్ పూజలు

మహదేవపూర్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం లోని  కాళేశ్వరం ఆలయాన్ని  మాజీ ఎంపీ,   చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్  ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకట స్వామి సతీమణి సరోజ మంగళవారం దర్శించుకున్నారు. ఈ ఎలక్షన్ లో వివేక్ వెంకటస్వామి భారీ మెజారిటీతో విజయం సాధించాలని కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి పూజలు చేశారు. అభిషేకంతో పాటు పలు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.  అనంతరం శుభానందాదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు చేశారు.  అర్చకులు వేదమంత్రాలతో వారిని ఆశీర్వదించారు.  కాగా కాళేశ్వరంలో కాంగ్రెస్ నేతలు సరోజ వివేక్​ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ  మమత నాగరాజు, కాంగ్రెస్ లీడర్లు పవన్ శర్మ , కేఎస్ ఆర్, అశోక్  పాల్గొన్నారు.