
ఘట్కేసర్, వెలుగు: ఘట్కేసర్ లోని గట్టు మైసమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గురువారం అర్ధరాత్రి దుండగులు ఆలయంలోకి ప్రవేశించి నాలుగు హుండీలను ఎత్తుకెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక హుండీలను పగులగొట్టి, అందులోని నగదును అపహరించారు. ఆలయ ఈవో భాగ్యలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ఆధారాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు.