
- రామగుండం రీజియన్ ఓసీపీ - 3లో ప్రమాదం
గోదావరిఖని, వెలుగు : సింగరేణిలోని రామ గుండం రీజియన్ ఓపెన్ కాస్ట్–3 ప్రాజెక్ట్‌లో జరిగిన ప్రమాదంలో జనరల్మజ్దూర్గాయపడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం ప్రాజెక్ట్ ఫేజ్–2లోని వివిధ మెషీన్లలో డిజిల్పోసేందుకు బోయర్వెహికల్ తో డ్రైవర్ పి.కార్తిక్, జనరల్మజ్దూర్కార్మికుడు శ్రావణ్బయలుదేరారు. మార్గమధ్యలో బ్రేక్‌లు ఫెయిల్‌కావడంతో వెహికల్ ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఆగకపోవడంతో శ్రావణ్కిందకు దూకి టైర్ల కింద సపోర్ట్పెట్టాడు.
అది దిగబడిపోవడంతో వెహికల్ముందుకు కదిలింది. శ్రావణ్ ప్రాణాలను కాపాడుకునేందుకు వెహికల్ మధ్యలోకి వెళ్లాడు. వెహికల్సైలెన్సర్ తక్కువ ఎత్తులో ఉండడడంతో అతడిని తాకుతూ వెళ్లడంతో గాయపడ్డాడు. వెంటనే అతడిని గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి, మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి రెఫర్చేశారు. గాయపడిన శ్రావణ్‌ను ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్లీడర్లు శంకర్‌నాయక్, అయిలి శ్రీనివాస్తదితరులు పరామర్శించారు. కాలం చెల్లిన వెహికల్స్‌ను మేనేజ్మెంట్నడపించడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఘటనపై విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.