TSPSC: పలు ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల

TSPSC: పలు ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల

పలు ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) విడుదల చేసింది. ఇందులో  మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, జూనియర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఉన్నాయి. 

గతేడాది ఆగస్టులో బీఆర్ఎస్ హయాంలో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 12 వేల186 మంది అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించగా.. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన వారి జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు టీఎస్ పీఎస్సీ తెలిపింది.