గ్రేట‌ర్ లో 10 రోజుల్లో వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాలి

గ్రేట‌ర్ లో 10 రోజుల్లో వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాలి

హైద‌రాబాద్: గ్రేట‌ర్ లో 10 రోజుల్లో వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్. మంగ‌ళ‌వారం ఆయ‌న డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన లోకేష్ కుమార్..ఒక్కో సర్కిల్లో వెయ్యి మందికి వాక్సినేషన్ వేసేల ఏర్పాట్లు చేసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. అంటే 30 సర్కిల్లో రోజుకు 30 వేల‌ చొప్పున,10 రోజుల‌ పాటు ఈ వాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. సూపర్ స్ప్రెడేర్స్ కు ముందుగా వాక్సినేషన్ జరిగేలా ఏర్పాట్లు చెయ్యాలన్నారు.

9 కేటగిరిలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంద‌న్నారు. స్ట్రీట్ వెండోర్స్, చికెన్, ఫిష్, కూరగాయల మర్కెట్స్, వైన్స్, హెయిర్ కటింగ్ సాలూన్స్, ఐరన్ షాప్స్, ఫ్రూట్, ఫ్లవర్ మర్కెట్స్, రైతు బజార్ లో వారికి 10 రోజుల్లో వాక్సినేషన్ పూర్తి చేయాలని తెలిపారు. 10 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ కోసం ప్రత్యేక స్థలాలు గుర్తించాలన్న క‌మిష‌న‌ర్..ఒక్కో సర్కిల్ కు 30 వేల‌ టార్గెట్ ను ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని అధికారుల‌ను ఆదేశించారు.