గద్వాల, వెలుగు : తనను సర్పంచ్‌గా గెలిచాక.. గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు రూ. 3,016, అమ్మాయి పెండ్లికి రూ.15,016 ఆర్థికసాయం చేస్తానని ఓ సర్పంచ్ క్యాండిడేట్ హామీ ఇస్తున్నారు. గద్వాల జిల్లా ఇటిక్యాల సర్పంచ్ పదవి కోసం ఆకెపోగు రాంబాబు పోటీలో ఉన్నారు. దీంతో తనను గెలిపిస్తే మొత్తం 20 హామీలు నెరవేరుస్తానంటూ పోస్టర్లు రిలీజ్ చేసి ప్రచారం చేస్తున్నారు.
లింగం చెరువు కింద భూములకు పట్టాలు ఇప్పిస్తానని, గ్రామ చావిడి నిర్మాణానికి కృషి చేస్తానని, ఎస్సీ కాలనీలో రేషన్ దుకాణం ఏర్పాటు చేస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అండర్ డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీలు ఇస్తున్నాడు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు.

