సీఎం జగన్ గుడ్ న్యూస్ : కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్.. ఎవరికంటే..

సీఎం జగన్ గుడ్ న్యూస్ :  కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్.. ఎవరికంటే..

 కరోనా కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుంటుంబాల వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది.  కోవిడ్ కారణంగా . కోవిడ్ కారణంగా మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి నియమించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేసింది.

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఎవ్వరినీ విడిచిపెట్టలేదు.. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు ఎలా ఎంతో మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అయితే, కోవిడ్ కారణంగా మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల వారికి కారుణ్య నియామకాల ప్రక్రియను సెప్టెంబర్ 30 లోగా పూర్తి చేసేందుకు సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు.  కోవిడ్ కారణంగా రాష్ట్రంలో  2,917 మంది ఉద్యోగులు మృతిచెందారు.. వారిలో ఇప్పటి వరకూ 2,744 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది..

 ప్రత్యేక డ్రైవ్ కింద అర్హులైన వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.. 2023 ఆగస్టు 24 తేదీకల్లా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. సెప్టెంబర్‌ 30 తేదీనాటికి ఈ నియామకాలకు సంబంధించి రిపోర్టు ఇవ్వాలని సూచించింది. అయితే, ఖాళీలు, పాయింట్లు, రోస్టర్లతో ఎటుంవంటి సంబంధం లేకుండా ఈ నియామకాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.