స్పీడ్ పోస్టులో దేవుని ప్రసాదం

స్పీడ్ పోస్టులో దేవుని ప్రసాదం
  • ఆర్డర్​ చేసిన రెండు, మూడు రోజుల్లో ఇంటికి పార్శిల్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల నుంచి భక్తుల ఇంటికే  ప్రసాదాలను పంపేందుకు పోస్టల్​ శాఖతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ్ రెడ్డి తెలిపారు. మొబైల్ యాప్ ద్వారా పూజ సేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతోపాటు పోస్టల్​ప్రసాదం పంపే సేవలను మంత్రి ఇంద్రక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ్ రెడ్డి శనివారం హైదరాబాద్​లో  ప్రారంభించారు. ఈ సంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 10 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల ప్రసాదాన్ని స్పీడ్ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పొందవచ్చన్నారు. ప్రసాదం హోం డెలివరీ కావాలనుకున్న భక్తులు దగ్గర్లోని పోస్టు ఆఫీస్​కు వెళ్లి బుక్​ చేసుకోవచ్చన్నారు. ఆర్డర్ చేసిన రెండు, మూడు రోజుల్లోనే  ప్రసాదం ఇంటికి వచ్చేస్తుందన్నారు.  దేశ వ్యాప్తంగా 1.60 ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షల పోస్ట్ ఆఫీసుల్లో ఈ సేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పొందొచ్చన్నారు. ఆల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య పూజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బుకింగ్ ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా పోస్టల్  శాఖ ద్వారా అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో  పూజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బుక్ చేసుకోలేని వారికోసం ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పారు.  

ఈ ఆలయాల ప్రసాదాన్ని బుక్​ చేసుకోవచ్చు

యాదాద్రి, భద్రాచలం, వేములవాడ, బాసర, కొండగట్టు, కొమురెల్లి, ఉజ్జయినీ మహంకాళి, సికింద్రాబాద్ గణేష్  టెంపుల్, బల్కంపేట ఎల్లమ్మ, కర్మాన్ ఘాట్ హనుమాన్​ టెంపుల్​ ప్రసాదాలను బుక్​ చేసుకోవచ్చని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.  ఆయా దేవస్థానాల్లో జరిగే నిత్య ఆర్జిత సేవల్లో  ప్రత్యక్షంగా పాల్గొనలేని  భక్తులు  వారి గోత్ర నామాలతో ఆన్ లైన్ పూజల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని, టీయాప్ ఫోలియోలో బుక్​ చేసుకోవాలన్నారు. దేవా దాయ శాఖ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ అనిల్ కుమార్, రాష్ట్ర చీఫ్ పోస్ట్ మాస్టర్ జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.