శ్రీహరికోట: ఈ ఏడాది తొలి ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. సోమవారం పీఎస్‌ఎల్వీ–సీ62 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఆదివారం మధ్యాహ్నమే ప్రారంభమైంది. ‘‘పీఎస్‌ఎల్వీ-–సీ62 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలైంది.
ఆదివారం మధ్యాహ్నం 12:48 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్.. సోమవారం ఉదయం 10:18 గంటల వరకు 22 గంటల 30 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఆ వెంటనే రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది” అని ఇస్రో ఆదివారం వెల్లడించింది. ఈ రాకెట్ థాయ్‌లాండ్, బ్రిటన్ తయారు చేసిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌తో పాటు మరో 13 ఉపగ్రహాలను సన్–సింక్రోనస్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనుంది. ప్రయోగ కేంద్రం నుంచి దూసుకెళ్లిన 17 నిమిషాల తర్వాత శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి చేర్చనుంది.
