వారం రోజుల నుంచి బంగారం ధర పెరిగిందా.. తగ్గిందా..

వారం రోజుల నుంచి బంగారం ధర పెరిగిందా.. తగ్గిందా..

భారతీయులు ఎక్కువగా ఇష్టపడేది బంగారు ఆభరణాలు. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇంక పెండ్లీల సీజన్ అయితే అసలు బంగారం అమ్మకాలు ఓ రేంజ్ లో ఉంటాయి. పసిడి విక్రయాలు విపరీతంగా పెరుగుతాయి. ఈ క్రమంలోనే బంగారం కొనాలనుకునే వారికి బిజినెస్ నిపుణులు పలు సలహాలు సూచనలు ఇస్తున్నారు. 

బంగారం విషయంలో లేట్ చేయకుండా కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తున్నారు. రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఇవాళ ఉన్న ధరే మేలనిపిస్తుందని అంటున్నారు. చూస్తుండగానే మార్చి నెలలో బంగారం ధర రూ. 4 వేలు పెరిగి ఆకాశం మీద నిచ్చవేసుకుని కూర్చుంది. బంగారం ధరలు గత వారం రోజుల నుంచి పెరిగింది పరిశీలిస్తే.. 

గత వారం రోజుల నుంచి పరిశీలిస్తే.. 

  • మార్చి 18 సోమవారం రోజు  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60 వేల 53 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66 వేలుగా ఉంది.
  • మార్చి 19 మంగళవారం రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60 వేల 95 గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66 వేల 48గా ఉంది.
  • మార్చి 20 బుధవారం రోజు  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60 వేల 95గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66 వేల 48గా ఉంది
  • మార్చి 21 గురువారం రోజు  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61 వేల95 గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  67 వేల 57గా ఉంది.
  • మార్చి 22 శుక్రవారం రోజు  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  61 వేల 50గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ. 67 వేలుగా ఉంది. 
  • మార్చి 23 శనివారం రోజు  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61 వేల 40గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ.66 వేల 97
  • మార్చి 24  ఆదివారం రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61 వేల 40గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ. 66 వేల 97గా ఉంది.