పౌష్టిక,సమతుల్య ఆహారంతో చక్కటి ఆరోగ్యం

పౌష్టిక,సమతుల్య ఆహారంతో చక్కటి ఆరోగ్యం

కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచంలో అత్యుత్తమంగా కుటుంబ ఆరోగ్యం పొందడంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి భారతదేశం అనుసరించాల్సిన విధానాలను గురించి చర్చించిన నిపుణులు.

 హైదరాబాద్ లో అల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా ఇవాళ(శుక్రవారం) వర్ట్యువల్‌ ప్యానెల్‌ ‘మహమ్మారి అనంతర ప్రపంచంలో వేగంగా మారుతున్నజీవనశైలి వేళ కుటుంబ ఆరోగ్యం పొందడంలో ఎదురవుతున్న సవాళ్లు’  అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశంతో పాటుగా యుఎస్‌ఏకు చెందిన నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌,  మ్యాక్స్‌హెల్త్‌కేర్‌–ఢిల్లీ,  రీజనల్‌ డైటెటిక్స్‌ హెడ్‌- రితికా సమద్ధార్‌, న్యూట్రిషియనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌,  షీలా కృష్ణస్వామి, అల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా గ్లోబల్‌ మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌ ఎమిలీ ఫ్లీష్మాన్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్‌జె షెజ్జీ మోడరేటర్‌గా వ్యవహరించారు.

పౌష్టికాహార, సమతుల్యమైన ఆహారం మాత్రమే చక్కటి ఆరోగ్యానికి  తోడ్పాటునందిస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. పౌష్టికాహారంతో పాటు ..ఒత్తిడి తగ్గించుకోవడానికి తగిన ప్రయత్నాలు చేయాలన్నారు.దీంతో ప్రతి వ్యక్తికీ మెరుగైన ఆరోగ్యం అందుతుందన్నారు.