ఏపీలో థియేటర్లలో హౌస్‌ఫుల్‌కు ఓకే

V6 Velugu Posted on Oct 13, 2021

అమరావతి: సినిమా ప్రేక్షకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పండుగల సీజన్ నేపథ్యంలో సినిమా థియేటర్లలో వందశాతం కెపాసిటీతో నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ఏడాదిన్నరకుపైగా చాలా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. మొదటి వేవ్ ముగిశాక.. కొన్ని రోజులు.. తిరిగి రెండో వేవ్ ఉధృతి తగ్గాక థియేటర్లు నడిపేందుకు అనుమతిచ్చినా కరోనా ఆంక్షల కారణంగా సగం కెపాసిటీతోనే నడుపుతున్న విషయం తెలిసిందే.

దసరా పండుగ సందర్భంగా  ప్రేక్షకుల సీటింగ్‌ కెపాసిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. ఇక నుంచి థియేటర్లలో వంద శాతం కెసాపిటీతో నడిపేందుకు అనుమతి ఇచ్చింది. 
దసరా సందర్భంగా మహా సముద్రం, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, పెళ్ళి సందD చిత్రాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ సినిమాల కలెక్షన్స్‌ బాగా పెరిగే అవకాశముండగా.. పండుగల సందర్భంగా కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేసే అవకాశం కలిగిందని సినీ అభిమానులు సంతోషపడుతున్నారు.
 

Tagged VIjayawada, Amaravati, Andhra Pradesh, Cinema Theatres, movie lovers, Movie Theatres, ap updates

Latest Videos

Subscribe Now

More News