- ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్రెడ్డి
ఎడపల్లి వెలుగు : పంచాయతీ ఎన్నికల్లో గెలిచే సర్పంచ్అభ్యర్థులు గ్రామాభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్రెడ్డి సూచించారు. శుక్రవారం బోధన్ నుంచి నిజామాబాద్ వెళుతూ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో సర్పంచ్ బరిలో ఉన్నారని, పనిచేసే అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.
ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఎమ్మెల్యే, మంత్రుల వద్దకు వెళ్లి గ్రామాభివృద్ధి కోసం కృషి చేసే అభ్యర్థికి పట్టం కట్టబెట్టాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పులి శ్రీనివాస్, పార్టీ నాయకులు ఎల్లయ్య యాదవ్, ఈరంటి లింగం, హన్మంత్ రెడ్డి, డల్లా సురేశ్ పాల్గొన్నారు.
ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులు చేయొద్దు
బోధన్ : సర్పంచ్ గా పోటీచేసే అభ్యర్థులు అడ్డగోలుగా ఖర్చులు చేయొద్దని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి సూచించారు. శుక్రవారం బోధన్, సాలూరా మండలాల్లోని జాడిజమాల్ పూర్, రాంపూర్, కల్టుర్కి, సాలూర గ్రామాలలో పర్యటించి, పోటీ చేసే అభ్యర్థులకు, ప్రజలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనుభవం ఉన్న సర్పంచ్ అభ్యర్థులను ఎన్నుకోవాలన్నారు. అనంతరం బోధన్ పట్టణంలోని రాకాసీపేట్ లయన్స్ జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు.
