
- వెయిటింగ్లో ఉన్న 29 మంది కమిషనర్లకు పోస్టింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్న 29 మంది కమిషనర్లకు పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ సెక్రటరీ, కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ (సీడీఎంఏ) టీకే శ్రీదేవి గురువారం ఉత్తర్వులిచ్చారు. బదిలీ అయిన వారిలో సెలక్షన్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్, గ్రేడ్ 1, 2, 3 మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు. జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్లుగా పనిచేసి మున్సిపల్ శాఖకు వచ్చిన సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు యాదగిరిరావుకు నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్గా, నళిని ప్రభావతికి ఖమ్మం మెప్మా పీడీగా పోస్టింగ్ ఇచ్చారు.
టీజీ బీపాస్ కు రఘును నియమించగా.. పటాన్చెరు ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్ గా మధుసూదన్ రెడ్డిని అపాయింట్ చేశారు. గద్వాల, మంచిర్యాల, నందికొండ, గజ్వేల్, యాదగిరిగుట్ట, లక్సెట్టిపేట, ఆదిలాబాద్, అలంపూర్, మక్తల్, నారాయణపేట, గుండ్ల పోచంపల్లి, జనగామ, ఇస్నాపూర్, సదాశివపేట, వైరా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసి వారి ప్లేస్లో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న వారిని ప్రభుత్వం నియమించింది.