డిగ్రీ కాలేజీల్లో 2,760 మంది సిబ్బంది రెన్యువల్

డిగ్రీ కాలేజీల్లో 2,760 మంది సిబ్బంది రెన్యువల్
  • వెలుగు' వార్తకు స్పందన 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో పనిచేసే  2,760 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, ఇతర సిబ్బందిని రెన్యువల్ చేశారు. మంగళవారం ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా జీవో రిలీజ్ చేశారు. 'వెలుగు' దినపత్రికలో ‘డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లకు మూడు నెలలుగా జీతాల్లేవ్’ హెడ్డింగ్​తో సోమవారం వార్త ప్రచురితమైంది. ఈ వార్త కథనంపైనే సర్కారు స్పందించింది.