రూ. 200 కోట్ల విలువ చేసే ధాన్యం మాయం..రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్

రూ. 200 కోట్ల విలువ చేసే ధాన్యం మాయం..రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్

అక్రమంగా పీడీఎస్ బియ్యం దందా చేసే వారిపై నల్లగొండ ఎస్పీ చందన దీప్తి ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కొంతమంది అక్రమ పీడీఎస్ దందా చేసే వ్యాపారులను  అదుపులో తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మిడి సోమ నర్సయ్యను అరెస్టు చేశారు పోలీసులు. సీఎమ్మార్ ధాన్యం ప్రభుత్వానికి ఇవ్వకుండా కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినందుకు గాను సోమ నర్సయ్యను అరెస్టు చేసినట్టు తెలిపారు పోలీసులు. 

రూ. 200 కోట్ల విలువ చేసే ధాన్యం మాయమైనట్లు అధికారులు తేల్చారు. అర్ధ రాత్రి నర్సయ్యను జడ్జి ముందు ప్రవేశ పెట్టారు. రిమాండ్ కు తరలించారు. విచారణలో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డట్టు తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోట్ల రూపాయల అక్రమ బియ్యం రవాణా చేసినట్టు సమాచారం. మరి కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పోలీస్ ప్రత్యేక టీం ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది.