
వరుస ఎన్నికల్లో అధికార పార్టీకి పడిపోతున్న ఓట్ షేర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గుతోంది. వరుస ఎన్నికల్లో గ్రాఫ్ కోల్పోతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటిన టీఆర్ఎస్ ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో డీలా పడుతూ వస్తోంది. 2018 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తిరుగులేని విజయం సాధించింది. 88 సీట్లను గెలుచుకుని అందనంత ఎత్తులో చేరింది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీకి 46.87 శాతం ఓట్లు పడ్డాయి. కానీ ఈ హ్యాపీడేస్ ఆ పార్టీకి ఎక్కువ రోజులు ఉండలేదు. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 9 సీట్లను మాత్రమే గెలుచుకుంది. లోక్సభ ఎన్నికల్లో 37.82 శాతం ఓట్లకు పడిపోయింది. హుజూర్‌నగర్ బైపోల్‌లో గెలిచినా ఆ వెంటనే వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. సోలిపేట రామలింగారెడ్డి మరణంతో జరిగిన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఆ ఎన్నికలో 35.77 శాతం ఓట్లకే పరిమితమైంది. ఇదే స్థానంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 54.36 శాతం ఓట్లు వచ్చాయి.
గేటర హైదరాబాద మునిస్పల కారొప్రేషన ఎనిన్నికల విషయానికొస్తే 35.77శాతానికి ఓట్ షేర్ పడిపోయింది. పసుత్త గాడుయ్యేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గ్రాప్ తగ్గిపోయింది. మొదటి పాధాన్యత ఓట్ల ప్రకారం చూస్తే రెండు స్థానాల్లో కలిపి అధికార పార్టీకి 31.7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.