నేషనల్ వర్క్ షాప్ లో బల్దియా కమిషనర్

నేషనల్ వర్క్ షాప్ లో బల్దియా కమిషనర్

కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: క్లైమేట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫెసిలిటీ వర్క్ షాప్ లో గ్రేటర్​ వరంగల్​ బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పాల్గొన్నారు. సోమవారం గ్లోబల్ మీథేన్ హబ్,  లోకల్ గవర్నమెంట్ ఫర్ సస్టైనబిలిటీ (ఇక్లి), డబ్ల్యూ ఆర్ఐ ఇండియా  సంయుక్త ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలోని ది థియేటర్  ఇండియా హ్యాబిటెడ్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన జాతీయ ఆవిష్కరణ వర్క్ షాప్ లో కమిషనర్ పాల్గొని గ్రేటర్​ వరంగల్​లో బయో మిథనైజేషన్ ప్లాంట్ తీరును  వివరించారు. 

అనంతరం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వాతావరణ ఆధారిత పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు సాగడం, వాతావరణ-కేంద్రీకృత పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించడం, ఆర్థిక సహాయం చేయడంలో ఎదురయ్యే సవాళ్లు, మిశ్రమ ఫైనాన్సింగ్ నమూనాలపై చర్చించారు. కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ ఇషా కాళీయా, సిటీ ఎంగేజ్మెంట్ లీడ్ అనితా భట్నాఘర్, హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠ, ఎన్ఐయూఏ డైరెక్టర్ డాక్టర్​ డెబోలినా కుందూ తదితరులు పాల్గొన్నారు.