కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కోతుల టెండర్ నిర్వహణ ప్రక్రియను పూర్తి చేసినట్లు అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు గ్రేటర్లో కోతులను పట్టుకోవడానికి బాక్స్ టెండర్ ను ఆహ్వానించామని, అందుకు అనుగుణంగా కాజీపేట, కాశీబుగ్గ రెండు సర్కిల్స్ పరిధిలో నిర్వహించిన టెండర్ ప్రక్రియలో శివయ్య అనే వ్యక్తి ఒక కోతిని పట్టుకోవడానికి రూ.520 కోట్ చేస్తూ టెండర్ వేశారని, తక్కువ రేటు కోట్ చేసిన అతడికే దక్కిందన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్ ఓ రాజారెడ్డి, ఎస్ఈ సత్యనారాయణ, వెటర్నరీ వైద్యులు గోపాల్ రావు తదితరులున్నారు.
