100 పడకల ఆస్పత్రికి భూమిపూజ

100 పడకల ఆస్పత్రికి భూమిపూజ

వర్ధన్నపేట, వెలుగు: ఉప్పరపల్లి క్రాస్​ వద్ద ఐదెకరాల ప్రభుత్వ భూమిలో రూ.28 కోట్లతో నిర్మించనున్న 100 పడకల ఆస్పత్రికి  ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు కలెక్టర్ సత్యశారద, టెస్కాబ్​చైర్మన్  మార్నేని రవీందర్ రావు తో కలిసి మంగళవారం భూమిపూజ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్​ప్రభుత్వంలో శిలాఫలకాలు వేశారే తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు.  ఈ ఆస్పత్రి పూర్తయితే వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాల ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యరంగాలపై ఫోకస్ పెట్టిందని తెలిపారు. 

వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి

వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని కలెక్టర్​సత్యశారద ఆదేశించారు. మంగళవారం వర్ధన్నపేట  మండలం ఇల్లందలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. కార్యక్రమాల్లో అడిషనల్​కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్​వో సాంబశివరావు, డీసీహెచ్​రామ్మూర్తి, ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ గౌడ్, డీసీఎస్ వో కిష్టయ్య పాల్గొన్నారు.