ఉద్యోగులు, టీచర్ల కేటాయింపుకు గైడ్​లైన్స్ రెడీ

ఉద్యోగులు, టీచర్ల కేటాయింపుకు గైడ్​లైన్స్ రెడీ
  • ఉమ్మడి జిల్లా పరిధి మారితే కొత్త జిల్లాలోనూ ఆప్షన్లు
  • పని చేస్తున్న టీచర్ల ఆధారంగానే ఖాళీ పోస్టులు
  • రెండు, మూడు రోజుల్లో గైడ్​లైన్స్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులు, టీచర్ల జిల్లాల కేటాయింపు గైడ్​లైన్స్ రెడీ అయ్యాయి. స్థానికత ఆధారంగా కేటాయింపులు చేయాలని సర్కారు భావించినా.. ఆ ప్రపోజల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ అంశం గురించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేకపోవడం, స్థానికతను పరిగణలోకి తీసుకుంటే కోర్టు కేసుల బెడద ఉంటుందనే కారణంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కొత్త పోస్టుల భర్తీపై దృష్టి పెట్టిన సర్కారు.. ప్రస్తుతమున్న వారికి జిల్లాల కేటాయింపు ప్రక్రియ స్పీడప్ చేస్తోంది. రెండు, మూడు రోజుల్లో గైడ్​లైన్స్ రిలీజయ్యే అవకాశముంది. టీచర్లకు ఉమ్మడి జిల్లాలోని అన్ని కొత్త జిల్లాలకు వెళ్లేందుకు ఆప్షన్లు ఇవ్వనున్నారు.

ఆదిలాబాద్, హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో ఇతర జిల్లాల్లోని కొన్ని గ్రామాలు, మండలాలు కలిశాయి. దీంతో అలాంటి వారికి ఉమ్మడి జిల్లాతో పాటు కొత్త జిల్లాకు వెళ్లేందుకు ఆప్షన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఏదైనా జిల్లాలో అవసరానికి మించి ఉద్యోగులు, టీచర్లు ఉంటే.. జూనియర్లను ఉమ్మడి జిల్లా పరిధిలోని మిగిలిన జిల్లాలకు పంపించనున్నారు. దీంతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్ల సంఖ్యకు అనుగుణంగానే.. ఆయా కొత్త జిల్లాలకు ఖాళీ పోస్టులను అలాట్ చేయనున్నారు. టీఎన్జీవో, టీజీవో లీడర్లకు వారు కోరుకున్న జిల్లాలోనే ఉండేందుకు అవకాశమిచ్చినట్టు తెలిసింది. కానీ టీచర్ల యూనియన్ల లీడర్లకు మాత్రం ఈ అవకాశమివ్వలేదని సమాచారం.