ధర్మసాగర్, వెలుగు: ఆన్లైన్ బెట్టింగ్ తో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల గ్రామానికి చెందిన చీమల రాకేశ్(22) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కొంత కాలం నుంచి ఆన్లైన్ లో రమ్మీ ఆడేవాడు. దీని కోసం పలు మొబైల్ యాప్స్ లలో లోన్లు తీసుకొని డబ్బంతా పోగొట్టుకున్నాడు.
అప్పును తిరిగి చెల్లించే అవకాశం లేకపోవడంతో గురువారం రాత్రి ఇంటిలో ఉన్న గడ్డి మందు తాగాడు. ఆ తరువాత తల్లికి చెప్పడంతో ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం చనిపోయాడు. మృతుడి తల్లి చీమల రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు తెలిపారు.
