క్విజ్ విజేతకు అభినందనల వెల్లువ

క్విజ్ విజేతకు అభినందనల వెల్లువ

హనుమకొండ సిటీ, వెలుగు: ఎన్​ఏసీవో (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో నాగాలాండ్ లో నిర్వహించిన జాతీయస్థాయి క్విజ్ పోటీల్లో కడిపికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మాటేటి దీక్ష ప్రతిభ చాటడంతో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రూ.లక్ష నగదు, ట్రోఫీని బహుమతిగా పొందింది. శనివారం నగరానికి వచ్చిన విద్యార్థినిని పలువురు అభినందించారు. 

హనుమకొండ కలెక్టర్​ స్నేష శబరీశ్, డీఈవో, అడిషనల్​ కలెక్టర్​ వెంకట్​రెడ్డి, డీఎంహెచ్​వో అప్పయ్య, అడిషనల్​ డీఎంహెచ్​వో మధన్మోహన్​రావు, వైద్య, విద్య శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందించారు. జాతీయ స్థాయిలో విజయం సాధించడానికి కృషి చేసిన జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ స్వప్న మాధురికి అధికారులు అభినందనలు తెలిపారు.