Harare 1st T20 Match : శ్రీలంకదే తొలి టీ20.. జింబాబ్వేపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపు

 Harare 1st T20 Match : శ్రీలంకదే తొలి టీ20.. జింబాబ్వేపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపు

హరారే: టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో పాథుమ్‌‌‌‌ నిశాంక (55), కమిందు మెండిస్‌‌‌‌ (41 నాటౌట్‌‌‌‌), కుశాల్‌‌‌‌ మెండిస్‌‌‌‌ (38) రాణించడంతో.. బుధవారం జరిగిన తొలి టీ20లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో లంక 1–0 ఆధిక్యంలో నిలిచింది. 

టాస్‌‌‌‌ ఓడిన జింబాబ్వే 20 ఓవర్లలో 175/7 స్కోరు చేసింది. బ్రియాన్‌‌‌‌ బెన్నెట్‌‌‌‌ (81) హాఫ్‌‌‌‌ సెంచరీ చేయగా, సికందర్‌‌‌‌ రజా (28) ఓ మాదిరిగా ఆడాడు. రైన్‌‌‌‌ బర్ల్‌‌‌‌ (17), సీన్‌‌‌‌ విలియమ్స్‌‌‌‌ (14), తషింగా ముసెకివా (11)తో సహా మిగతా వారు నిరాశపర్చారు. 

దుష్మంత చమీరా 3, నువాన్‌‌‌‌ తుషారా, మహేశ్‌‌‌‌ తీక్షణ, దుషాన్‌‌‌‌ హేమంత తలో వికెట్‌‌‌‌ తీశారు. తర్వాత శ్రీలంక 19.1 ఓవర్లలో 177/6 స్కోరు చేసి నెగ్గింది. 

నిశాంక, కుశాల్‌‌‌‌ మెండిస్‌‌‌‌ తొలి వికెట్‌‌‌‌కు 96 రన్స్‌‌‌‌ జోడించారు. కుశాల్‌‌‌‌ పెరీరా (4), నువానిండు ఫెర్నాండో (7), చరిత్‌‌‌‌ అసలంక (1), దాసున్‌‌‌‌ షనక (6) ఫెయిలైనా, కమిందు నిలకడగా ఆడి గెలిపించాడు. రిచర్డ్‌‌‌‌ ఎంగ్రావ 2 వికెట్లు పడగొట్టాడు. కమింద్‌‌‌‌ మెండిస్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య శనివారం రెండో టీ20 జరుగుతుంది.