రాజన్న సన్నిధిలో భక్తుల సందడి

రాజన్న సన్నిధిలో భక్తుల సందడి

వేములవాడ, వెలుగు ​: వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ముందుగా ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించిన అనంతరం తలనీలాలు సమర్పించారు. ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం, కోడె మొక్కు క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్న అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు.