ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద

ఎస్సారెస్పీకి  పోటెత్తిన వరద

బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు వరద పోటెత్తుతోంది.శనివారం ఎగువ గోదావరి నుంచి లక్షా32వేల395 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది.  ప్రాజెక్టు 22 గేట్లు ఓపెన్ చేసి లక్షా 14వేల680 క్యూసెక్కుల నీటిని గోదావరి లోకి వదులుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 42వేల క్యూసెక్కులు వచ్చిన వరద క్రమంగా 67వేలకు పెరిగింది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లు ద్వారా 50వేల క్యూసెక్కులు వదిలారు. 92వేలకు పెరగడంతో 23 గేట్లు పెంచి 75వేల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల చేపట్టారు. 

తెల్లవారుజామున లక్ష క్యూసెక్కులకు చేరడంతో గోదావరి లోకి 91వేల క్యూసెక్కుల నీటిని పెంచారు. సాయంత్రానికి ఎగువ నుంచి వచ్చే వరదనీరు లక్షా32వేల395క్యూసెక్కులకు చేరగా, 22గేట్లతో లక్షా14వేల680 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 19వేల క్యూసెక్కుల నుంచి 8వేల క్యూసెక్కులకు తగ్గించినట్లు డీఈ గణేశ్​తెలిపారు. కాకతీయ కెనాల్ కు నీటి విడుదల నిలిపేశారు. ఎస్కేప్ గేట్లకు 8000 క్యూసెక్కులు, సరస్వతీ కెనాల్ కు 800క్యూసెక్కులు, మిషన్ భగీరథ కు తాగునీటి కోసం 231క్యూసెక్కుల నీటి సరఫరా చేస్తున్నారు.