గాలి దుమారం.. వడగండ్ల వాన

గాలి దుమారం.. వడగండ్ల వాన

జైపూర్(భీమారం), వెలుగు: ఉమ్మడి మండలంలో గురువారం అర్ధరాత్రి గాలి దుమారం, వడగండ్ల వానతో భీమారం, బూరుగుపల్లి, కాజీపల్లి దాంపూర్ గ్రామాల్లో మామిడి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చెట్లు, విద్యుత్​స్తంభాలు విరిగి రోడ్డుపై పడగా అధికారులు తొలగించారు. పలు గ్రామాల్లో రేకులు, ఇండ్ల పెంకులు ఎగిరిపోయాయి. 

ఆరబెట్టిన వరి ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కరెంట్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. భీమారం మండల కేంద్రంలోని  కోరమాండల్ వారి మనోమోర్ ఎరువుల గోదాం  పైకప్పు ఎగిరిపోయి, ఎరువుల బస్తాలు తడిశాయి. సుమారు రూ.5 లక్షల నష్టం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.