
- వికారాబాద్ జిల్లాలో ఘటన
వికారాబాద్, వెలుగు: గత మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షం.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది. తాండూరు లోని కాగ్నా నది ఉప్పొంగడంతో జీవన్గి గోశాలలో ఉన్న సుమారు 100 ఆవులు మృత్యువాతపడ్డాయి.
మహబూబ్నగర్ మాజీ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఈ గోశాలలో సుమారు 150 ఆవులు ఉన్నాయి. కాగ్నా నది వరద కారణంగా గోశాలలో నీళ్లు చేరాయి. తాళ్లతో ఆవులు కట్టేసి ఉండటంతో చనిపోయాయి. కర్నాటకకు చెందిన అధికారులు స్పందించి.. గోశాలకు చేరుకుని కట్టి ఉన్న కొన్ని ఆవుల తాళ్లను కత్తిరించి కాపాడారు.