Viral Video: సూపర్ ఐడియా: ఈ బ్రో ట్రాఫిక్ లో ఎలా రోడ్డు క్రాస్ చేశాడో చూడండి..

Viral Video: సూపర్ ఐడియా:  ఈ బ్రో ట్రాఫిక్ లో ఎలా రోడ్డు క్రాస్ చేశాడో చూడండి..

నగరాల్లో జనాలు రోడ్డు క్రాస్ చేయాలంటే తిప్పలు తప్పవు.. రయ్ రయ్ మంటూ దూసుకెళ్లే వాహనాలతో పాదచారులు రోడ్డు దాటాలంటే పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  గంట గంటకూ పెరుగుతున్న ట్రాఫిక్ జనాలను ఇబ్బంది పెడుతుంది. ఓ వ్యక్తి రోడ్డు దాటేందుకు వినూత్నమైన ఆలోచించి క్రాస్ చేశాడు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  

ghantaa అనే ఇన్ స్ట్రాగ్రామ్ లో  పోస్ట్ అయిన వీడియో వైరల్‌  అయింది.  ఈ  వీడియోలో ఓ యువకుడు రోడ్డు దాటేందుకు ఫుట్‌పాత్‌పై నిలబడ్డాడు. ఎంతసేపు వేచిచూసినా వాహనాల రాకపోకలు ఆగడం లేదు. రోడ్డు దాటేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా దాటలేకపోయాడు. దీంతో ఇలా అయితే కుదరదనుకున్నాడు. వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. అతను నడవలేనట్లుగా మోకాళ్లపై నిలిచి రోడ్డు దాటడం మొదలు పెట్టాడు. ఇంతలో ఓ కారు రయ్‌ మంటూ దూసుకువచ్చి.. ఆ యువకుడి వద్ద ఆగింది. అందులో నుంచి దిగిన వ్యక్తి యువకుడు రోడ్డు దాటే వరకు వాహనాలు వెళ్లకుండా అడ్డుగా నిలిచి అతడిని రోడ్డు దాటించాడు. అయితే రోడ్డు దాటే వరకు మోకాళ్లపై నడిచిన యువకుడు దాటగానే లేచి పరిగెత్తాడు. దీంతో కారు ఆపిన వ్యక్తి షాక్‌ అయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు యువకుడి ఐడియాను మెచ్చుకుంటున్నారు. సూపర్‌ ఐడియా బ్రో అంటూ ప్రశంసిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ghantaa (@ghantaa)

 ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ మోటార్‌ వాహనాలు పెరుగుతున్నాయి. బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య తగ్గుతోంది. చిన్నదో పెద్దతో సొంత వాహనమే మేలనుకుంటున్నారు చాలా మంది. దీంతో రోడ్లపై భారీగా రద్దీ పెరుగుతోంది. పెరుగుతున్న రద్దీతో రోడ్డు క్రాస్‌ చేయడం పాదచారులకు కష్టంగా మారుతోంది. మనుషుల కన్నా ఎక్కువగా వాహనాల సంఖ్య పెరిగిపోయింది.. దీంతో మనుషులు రోడ్లపై నడవక తప్పని సరి అయినా.. అడుగు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది.. ఇక ఇలా చాలా మంది పాదాచారులు తమ గమ్యస్థానానికి లేట్‌గా చేరుకుంటున్నారు. రోడ్డు దాటడానికి నానా తంటాలు పడుతుంటారు. అయితే హెవీ ట్రాఫిక్‌లో రోడ్డు దాటటానికి వినూత్న ఆలోచన చేశాడు ఓ యువకుడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది..

ట్రాఫిక్‌ గంట గంటకు పెరుగుతుంది.. రోడ్డు దాటడం చాలా కష్టంగా మారుతోంది. ఈ కారణంగానే ప్రభుత్వాలు రోడ్లు దాటేందుకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను నిర్మిస్తున్నాయి. దీంతో ప్రమాదాలు జరగకుండా ఈ వంతెనలు లేని చోట రోడ్డు దాటాల్సి వస్తోంది. ప్రస్తుతం రోడ్డు దాటడం అంటే ఓ యుద్ధం చేయాల్సి వస్తుంది. రోడ్డు దాటడం అతి కష్టంగా మారింది.