సిరిసిల్ల కలెక్టర్పై చర్యలు తీసుకోండి : హైకోర్టు

సిరిసిల్ల కలెక్టర్పై  చర్యలు తీసుకోండి : హైకోర్టు
  • హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మిడ్ మానేరు నిర్వాసితురాలు వనపట్ల కవితకు నష్టపరిహారం చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయినా పరిహారం చెల్లించకపోవడంతో పాటు అక్రమ కేసులు నమోదు చేయటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కవిత పై అక్రమ కేసులు నమోదు చేయాలని ఆర్డీవో, తహసీల్దార్​ను కలెక్టర్ ఆదేశించటంపై హైకోర్టు ఫైర్ అయింది. ఈ అంశంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై చర్యలు తీసుకోవాలని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. కలెక్టర్ ఆదేశాలతో కవితపై అక్రమ కేసు నమోదు చేశారు. దీంతో బాధితురాలు కవిత మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. 

మంగళవారం కోర్టుకు హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా డ్రెస్సింగ్ సెన్స్ పై హైకోర్టు తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ప్రొసీడింగ్స్ తెలియదా.. కోర్టుకు వచ్చే పద్ధతి ఇదే నా అంటూ కలెక్టర్ పై హైకోర్టు ఫైర్ అయింది.  కలెక్టర్ ను చూస్తే మాకే భయంగా ఉందని, ప్రజలకు ఎలా సేవా చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో ఇచ్చిన నష్టపరిహారం తీర్పు యథావిధిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని, సీఎస్ ను హైకోర్టు ఆదేశించింది.