HIT 3 Box Office: ఫస్ట్ డే వసూళ్లతో దుమ్మురేపిన హిట్ 3.. ఎన్ని కోట్లంటే?

HIT 3 Box Office: ఫస్ట్ డే వసూళ్లతో దుమ్మురేపిన హిట్ 3.. ఎన్ని కోట్లంటే?

హీరో నాని నటించిన లేటెస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. గురువారం మే1న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రలో నటించిన నాని తన వయోలెంట్ యాంగిల్ను పరిచయం చేశాడు. దాంతో థియేటర్లకు జనం పోటెత్తుతున్నారు.

ఈ క్రమంలో హిట్ 3 మూవీ ఫస్ట్ డే వసూళ్లు ఎలాంటి అంచనాలు సాధించింది? ముందస్తు అంచనాలకు తగ్గట్టుగా నాని కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చేసిందా? లేదా అనేది లుక్కేద్దాం. 

హిట్ 3 ఫస్ట్ డే వసూళ్లతో దుమ్మురేపింది. నాని కెరియర్లోనే సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించింది. ఈ మూవీ ఫస్ట్ డే ఇండియాలో రూ.19 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో రూ.18.25 కోట్లు, తమిళంలో రూ.35 లక్షలు, కన్నడలో రూ.5 లక్షలు, హిందీలో రూ.25 లక్షలు మరియు మలయాళంలో రూ.1 లక్ష మాత్రమే సంపాదించింది. అయితే, ఈ నెట్ వసూళ్లు అనేది అధికారిక లెక్కలు కాకపోయినప్పటికీ, ట్రేడ్ నిపుణుల అంచనాల ఆధారంగా పలు నివేదికలు చెబుతున్నాయి. 

అయితే, నాని నటించిన దసరా మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.23.2 కోట్ల నెట్ వసూలు చేసింది. దాంతో రెండో బిగ్గెస్ట్ ఓపెనింగ్గా హిట్ 3 నిలిచింది. అందువల్ల, హిట్ 3 డే1 వసూళ్లతో, దసరా మూవీని క్రాస్ చేయలేకపోయింది. నాని గత  సినిమాలు చూసుకుంటే.. సరిపోదా శనివారం తొలి రోజు (రూ.9 కోట్ల నెట్), అంటే సుందరానికి (రూ.6.25 కోట్లు నెట్) చేశాయి.

నేడు (మే 2న) హిట్ 3 ఫస్ట్ డే గ్రాస్ వసూళ్లను మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు నాని నటించిన 'దసరా' తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.38 కోట్ల గ్రాస్ వసూలు చేసి టాప్లో ఉంది. దాదాపు రూ.43 కోట్లకి పైగా హిట్ 3 గ్రాస్ వసూలు చేస్తే, నాని కెరియర్లో ఫస్ట్ డే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గ్రాసర్ గా నిలిచే అవకాశముంది. హిట్ 3 మూవీ గ్రాస్ ఎంతనేది కాసేపట్లో తెలిసిపోతుంది. 

తొలిరోజు హిట్ 3 సినిమాకు 87.82% తెలుగు ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. మార్నింగ్ షోలు 79.57%, మధ్యాహ్నం 92.37%, సాయంత్రం, 91.52%, నైట్ షోలు 88.46%ఆక్యుపెన్సీ ఉంది. మధ్యాహ్నం షోలోకి ఎక్కవ ఆక్యుపెన్సీ నమోదైంది.