ఇందిరమ్మ నిర్మాణాల్లో కామారెడ్డి టాప్ : ఎండీ వీపీ గౌతమ్

ఇందిరమ్మ నిర్మాణాల్లో కామారెడ్డి టాప్ : ఎండీ వీపీ గౌతమ్
  • హౌజింగ్ కార్పొరేషన్ సెక్రటరీ అండ్ ఎండీ వీపీ గౌతమ్

​కామారెడ్డి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో కామారెడ్డి జిల్లా టాప్​లో ఉందని, ఇందుకు కృషి  చేసిన కలెక్టర్, ఇతర అధికారులను రాష్ర్ట హౌజింగ్ కార్పొరేషన్​ సెక్రటరీ అండ్​ ఎండీ వీపీ గౌతమ్​ అభినందించారు. బుధవారం ఆయన జిల్లాలో పర్యటించారు. భిక్కనూరు మండలం బస్వాపూర్​లో ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. మండల కేంద్రంలో ఫిల్టర్ రూప్ టెక్నాలజీ ద్వారా నిర్మిస్తున్న మాడల్​ ఇందిరమ్మ ఇల్లును,  దోమకొండ మండలం గొట్టిముక్కులలో ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​తో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో అధికారులతో రివ్యూ చేసి మాట్లాడారు. నిర్మాణ పనుల కోసం క్లస్టర్ల వారీగా అధికారులను నియమించటం అభినందనీయమన్నారు.  

ఫిల్టర్ రూప్ పద్ధతిలో  నిర్మిస్తున్న మోడల్​ ఇల్లు నార్మల్ ఇల్లు కంటే  తక్కువ ఖర్చుతో  నిర్మించవచ్చన్నారు.  తహసీల్దార్లు, ఎంపీడీవోలు కోఆర్డినేట్​ చేసుకొని లబ్ధిదారులకు ఇసుక టోకెన్లు అందించాలన్నారు. ఇసుక, కంకర, ఇనుము, సిమెంట్, ఇటుకల ధరల నియంత్రణపై అధికారులు పర్యవేక్షించాలన్నారు. అన్ని ఏరియాల్లో పిల్లర్స్ అవసరం లేదన్నారు. పెండింగ్​లో ఉన్న డబుల్​ బెడ్​ రూం ఇండ్ల సమస్యలను  పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేయాలన్నారు.  

11,883 ఇండ్లు మంజూరు చేయగా, ఇందులో 5,721 ఇండ్లకు ముగ్గు పోశామన్నారు.  2,182 ఇండ్లు బెస్మిట్ లేవల్,  66 రూప్​లేవల్, 1 కంప్లీట్ అయ్యిందన్నారు.  2,112 ఇండ్ల వరకు నిర్మించగా బిల్లులు చెల్లించామన్నారు. 431 ఇండ్లకు మహిళా సంఘాల ద్వారా లోన్ ఇచ్చారన్నారు.  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​, అడిషనల్ కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్,  హౌజింగ్​ పీడీ విజయ్ పాల్ రెడ్డి,  ఆర్డీవో వీణ, డీఈ సుభాష్​, ఏఈలు, స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.  

నిధుల సమస్య లేదు..

నిజామాబాద్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నిధుల సమస్య లేదని హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన డిచ్​పల్లి మండలం తిర్మన్​పల్లి, డిచ్​పల్లిలోని ఘన్​పూర్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన అనంతరం కలెక్టరేట్​లో జరిగిన మీటింగ్​లో మాట్లాడారు. లబ్ధిదారులపై నిర్మాణ ఖర్చులు తగ్గేలా ఫ్రీ ఇసుక టోకన్లు అందించాలని, కంకర, ఐరన్​, సిమెంట్​, ఇటుకల రేట్స్​ను మండల ధరల నియంత్రణ కమిటీ అదుపుచేయాలన్నారు.

నగరంలోని అభయహస్తం కాలనీలోని 4.32 ఎకరాల ల్యాండ్​లో  జీ+3 విధానంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డిని కోరారు. పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​తో జిల్లాలోని మండలాల వారీగా  ఇండ్ల నిర్మాణాల పురోగతిని ఎండీకి చూపారు. అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్​ సబ్​ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్​ కరోలిన్​, జడ్పీ సీఈవో సాయాగౌడ్​, నగర పాలక కమిషనర్​ దిలీప్​కుమార్​, మెప్మా పీడీ రాజేందర్​, హౌసింగ్​ జిల్లా మేనేజర్​ పవన్ ఉన్నారు.