మొండెం కవర్లో.. కాళ్లు, చేతులు, తల ఎక్కడో..! హైదరాబాద్లో భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త

మొండెం కవర్లో.. కాళ్లు, చేతులు, తల ఎక్కడో..! హైదరాబాద్లో భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త

భర్తది రెడ్డి సామాజిక వర్గం.. భార్యది యాదవ సామాజిక వర్గం. ఇద్దరూ నలుగురికి ఆదర్శం అనిపించేలా ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ జీవితంలో మాత్రం ఆదర్శంగా బతకలేకపోయారు. భార్యభర్తల మధ్య ఏం గొడవలు ఉన్నాయో తెలియదు కానీ.. భార్యను అతి కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి కవర్ లో ప్యాక్ చేశాడు భర్త. ఈ ఘటన హైదరాబాద్ లో శుక్రవారం(ఆగస్టు 23) రాత్రి చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ కామారెడ్డిగూడ కు  చెందిన మహేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన యాదవ కులానికి చెందిన స్వాతి(22 అలియాస్ జ్యోతి)ని ప్రేమ వివాహం చేసుకున్నారు. 25రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి బోడుప్పల్ లోని బాలాజీహిల్స్ లో  అద్దెకు ఉంటున్నారు. మహేందర్ రెడ్డి రాపిడో నడుపుతున్నాడు. స్వాతి గర్భవతి అని స్థానికులు అందించిన సమాచారం ప్రకారం తెలిసింది. హత్య గురించి మహేందర్ రెడ్డి బంధువు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

గతంలో ఇద్దరు ఇదే ప్రాంతంలోని ఇదే ఇంట్లో ఓ పది నెలలు ఉండి వెళ్ళినట్లు స్థానికులు చెప్తున్నారు. మళ్ళీ 25 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఉంటున్న వీళ్ల మధ్య ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. 

మొండెం కవర్లో.. కాళ్లు చేతులు, తల ఎక్కడో..

మహేందర్ రెడ్డి తన భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. బాడీని ముక్కలు ముక్కలుగా నరికి.. మొండెంను కవర్ లో ప్యాక్ చేశాడు. కాళ్ళు, చేతులు, తల వేరు చేసి ఎక్కడో వేసినట్లు తెలుస్తోంది. వాటి కోసం పోలీసులు వెదుతుకున్నారు. ఇంట్లో ఛాతీ భాగంమాత్రమే ఉందని పోలీసులు తెలిపారు. 

చంపేసి పోలీస్ స్టేషన్కు..

ఈ ఘటనలో ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మహేందర్ రెడ్డి స్వాతిని ప్రేమించినప్పటికీ పెళ్లి ఇష్టం లేదని తెలుస్తోంది. ప్రేమ వ్యవహారం బయటపడటంతో ఒప్పించి పెళ్లి చేశారు పెద్దలు. అప్పటి నుంచి అయిష్టంగా భార్యతో ఉంటున్న మహేందర్ రెడ్డి.. ఆమెను కడతేర్చాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ప్లాన్ ప్రకారమే ఆమెను చంపేశాడని స్వాతి బంధువులు చెబుతున్నారు. 

స్వాతితో ఉండటం ఇష్టం లేకపోయినా జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయంలో కుటుంబ సభ్యులు సర్తి చెప్పారు.  వివాహం అయిన నాలుగు నెలలకే భార్య స్వాతి గర్భవతి అయ్యింది. ఇష్టం లేని భర్త మహేందర్.. అబార్షన్ చేయించాడు. 

ఆదివారం భార్య స్వాతిని చంపిన మహేందర్.. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. మొండెం ఒక్కటే ఉండటంపై పోలీసులు ప్రశ్నించగా.. కాళ్లు, చేతులు, తల సమీపంలోని ప్రతాప సింగారం దగ్గర మూసీలో పడేసినట్లు తెలిపాడు. క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్, డాగ్ స్కాడ్ , DRF బృందాలతో మృతదేహం కోసం గాలిస్తున్నారు.