నిండిన హుస్సేన్ సాగర్..పరిసర ప్రాంతాల ప్రజలకు అలర్ట్

నిండిన హుస్సేన్ సాగర్..పరిసర ప్రాంతాల ప్రజలకు అలర్ట్

హైదరాబాద్లో  కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. 513.50 మీటర్ల మేర నీరు చేరుకుంది. దీంతో సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ ను క్రాస్ చేసిందని అధికారులు ప్రకటించారు. హుస్సేన్ సాగర్  నిండడంతో  దిగువ ప్రాంతాలకు నీటిని వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాల ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని అధికారులు  సూచిస్తున్నారు.

మరోవైపు హైదరాబాద్ లోని జంట జలాశయాలైన హిమాయత్ సాగర్ జలకళను సంతరించుకుంది. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయిలో నిండిపోయింది.  పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు..ప్రస్తుతం 1761.70 అడుగులకు నీరు చేరింది. సాగర్ ఇన్ ఫ్లో 1500 క్యూసెక్కులు కాగా..ఔట్ ఫ్లో 1340 1340 క్యూసెక్కులుగా ఉంది.  హిమాయత్ సాగర్  నాలుగు గేట్లు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

అటు  గండిపేట (ఉస్మాన్ సాగర్)జలాశయానికి కూడ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.  గండిపేట  పూర్తిస్థాయి  నీటి మట్టం 1790  అడుగులు కాగా ప్రస్తుతం 1786.10 అడగులకు నీరు చేరింది. ప్రాజెక్టులోకి 1200 క్యూసెక్కుల నీరు వస్తోంది.