ఇషా వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డు.. స్వర్ణం గెలిచిన హైదరాబాద్ షూటర్

ఇషా వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రికార్డు.. స్వర్ణం గెలిచిన హైదరాబాద్ షూటర్

మ్యూనిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డుతో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలుచుకుంది. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 25 మీటర్ల పిస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఇషా 43 పాయింట్లు సాధించి టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. దాంతో రెండేళ్ల కిందట బాకులో కొరియా షూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యేజీ నెలకొల్పిన 42 పాయింట్ల వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డును బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. 

అలాగే యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జియిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరిట ఉన్న జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డు (41 పాయింట్లు) కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇషాకు ఇది నాలుగో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇషా 10 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఐదింటిలో 5/5 పాయింట్లు నెగ్గింది. 

డొరీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెన్నెకాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జర్మనీ, 38), మిరోస్లోవా మించెవా (బల్గేరియా) వరుసగా సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కైవసం చేసుకున్నారు. క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇషా (587) నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలవగా, మను భాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (582), రాహి సర్నోబాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (581)..12, 14వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 50 మీటర్ల రైఫిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3 పొజిషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆషి చౌక్సే ఒక్క పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరే అవకాశాన్ని కోల్పోయింది. 589 పాయింట్లతో 10వ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.