
- ఇందులో 5 ఎకరాలు కేఎల్ యూ ఆక్రమించివి
హైదరాబాద్ సిటీ, వెలుగు: కుత్బుల్లాపూర్మండలం గాజులరామారంలో కబ్జాకు గురైన15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. అక్కడి సర్వే నంబర్354లోని ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు మంగళవారం తొలగించారు. ఈ 15 ఎకరాల్లోనే కేఎల్‌యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించిన 5 ఎకరాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి 2009లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ 15 ఎకరాల ప్రభుత్వ భూమిని రాజీవ్ స్వగృహ నిర్మాణాల కోసం కేటాయించింది.
అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో స్థానికంగా ఉండే కొందరు లీడర్ల కన్ను పడింది. ఇక్కడి కబ్జాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో హైడ్రా అదికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే చేయించారు. ప్రభుత్వ భూమిని గుర్తించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు నివేదిక అందజేశారు. ఆయన ఆదేశాలతో మంగళవారం ఆక్రమణలను తొలగించిన అధికారులు, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టారు.