అతను తెలంగాణకు వస్తే తరిమి తరిమి కొడతా

అతను తెలంగాణకు వస్తే తరిమి తరిమి కొడతా

హిందూ దేవుళ్ళను కించపరుస్తూ కామెడీలు చేసే మునావర్ ఫారుఖీనీ 16 రాష్ట్రాలు బ్యాన్ చేశాయని అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. అలాంటి వ్యక్తిని తెలంగాణకు వచ్చి..కామెడీ షో చేయాలని కేటీఆర్ ఆహ్వానించారని మండిపడ్డారు. హిందూ దేవుళ్లను కించపరిచిన మునావర్ ఫారుఖీని ఎందుకు ఆహ్వానించారో చెప్పాలని కేటీఆర్ ను ప్రశ్నించారు. అతను తెలంగాణకు వస్తే తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. ఆ తరువాత జరిగే పరిణామాలకు కేటీఆరే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.