రిమోట్​ కార్​కు ఆర్డరిస్తే..​  బిస్కెట్​ ప్యాకెట్ వచ్చింది

రిమోట్​ కార్​కు ఆర్డరిస్తే..​  బిస్కెట్​ ప్యాకెట్ వచ్చింది

న్యూఢిల్లీ: ఇంట్లో పిలగాళ్లు ఆడుకుంటరని ఆన్​లైన్​లో రిమోట్​ కారు ఆర్డర్​ చేస్తే.. బిస్కెట్​ పుడొచ్చింది. కవర్​ ఎత్తుగా ఉండటం చూసి కారు ఎంత పెద్దగ ఉందో అనుకొని విప్పితే పార్లేజీ బిస్కెట్​ పుడ ఎళ్లింది. ఈ ఆసక్తికర ఘటన సోమవారం ఢిల్లీలో జరిగింది. భగవాన్​ నగర్​ ఆశ్రమ్​ ఏరియాకు చెందిన విక్రమ్​ బురగోహైన్​ ఇటీవల అమెజాన్​ ఈ కామర్స్​ వెబ్​సైట్​లో పిల్లలు ఆడుకునే రిమోట్​ కార్​ బుక్​ చేశాడు. సోమవారం ఆర్డర్ అందుకున్న విక్రమ్​ ఆ కవర్​ విప్పి చూశాడు. కారు ఉండాల్సిన కవర్లో పార్లేజీ బిస్కెట్​ ప్యాకెట్ ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆర్డర్​ వెంటనే రిప్లేస్​ చేసిన అతను తనకు వచ్చిన బిస్కెట్​ ప్యాకెట్​​ ఫొటో తీసి ఫేస్​ బుక్​లో షేర్​ చేశాడు. ‘రిమోట్​ కారు ఆర్డర్​ చేస్తే.. బిస్కెట్​ ప్యాకెట్​ వచ్చింది. ఇగ చాయి పెట్టుకోవాలి’ అని ఫొటో కింద క్యాప్షన్​ రాయగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్​ చేశారు. మొన్నామధ్య ముంబైలో ఓ వ్యక్తికి ఇలాగే జరిగింది. మౌత్​ ప్రెషనర్​ ఆర్డర్​ చేస్తే స్మార్ట్​ ఫోన్​ వచ్చింది.