జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి

జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి

రాయికల్​, వెలుగు: జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ఐజేయూ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చీటీ శ్రీనివాస్ రావు అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని మార్కండేయ పద్మశాలి సంఘం భవనంలో రాయికల్​ ప్రెస్​క్లబ్​ (జేఏసీ) ఆధ్వర్యంలో ఐజేయూ కొత్త జిల్లా కార్యవర్గానికి సన్మానించారు. 

ఈ సందర్భంగా శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రావు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే వారధిలా పనిచేస్తున్నారని తెలిపారు జిల్లా ప్రధాన కార్యదర్శి సంపూర్ణచారి, ఉపాధ్యక్షులు హరికృష్ణ, అల్లె రాము, జాయింట్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ చంద్రశేఖర్, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేణుగోపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు రఘుపతిరెడ్డి, నరేశ్‌‌‌‌‌‌‌‌, లక్ష్మణ్, శ్రీకాంత్, రాయికల్ ప్రెస్ జేఏసీ అధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, ఉపాధ్యక్షుడు సాయికుమార్, జాయింట్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ సురేశ్‌‌‌‌‌‌‌‌ , సాంస్కృతిక కార్యదర్శి ఏఎం రాజు రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌లు పాల్గొన్నారు.