నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్కలెక్టర్గా ఇలా త్రిపాఠి బుధవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. నల్గొండ నుంచి బదిలీపై వచ్చిన ఆమెకు కలెక్టరేట్ ఎదుట అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్ పూల బొకే అందించి స్వాగతం పలికారు. తరువాత ఆమె తన చాంబర్లో ముఖ్య శాఖల ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించి జిల్లా వివరాలను తెలుసుకున్నారు.
సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ఏవో ప్రశాంత్ కూడా ఉన్నారు. జిల్లా ప్రజలకు కొత్త కలెక్టర్ ఇలా త్రిపాఠి న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆలోచనలు, ఆశయాలతో ముందుకు సాగాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాల అమలులో యంత్రాంగం రెట్టించిన ఉత్సహంతో పని చేయాలన్నారు.
