తెలంగాణలో 5 రోజులు తేలికపాటు వర్షాలు:ఐఎండీ

తెలంగాణలో 5 రోజులు తేలికపాటు వర్షాలు:ఐఎండీ

తెలంగాణలో ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40  కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. మహారాష్ట్ర దగ్గర   కేంద్రీకృతమైన ఆవర్తనం  కారణంగా వర్షాలు పడతాయని వెల్లడించింది.  ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ , నిజామాబాద్, వరంగల్, జిల్లాల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉంది.  

గత రెండు రోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.   44 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ 9న అత్యధికంగా 40  డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాబోయే ఐదు రోజులు ఇంకా తగ్గే అవకాశం ఉంది.

అలాగే  ఈ ఏడాది సమయానికే నైరుతి  రుతుపవనాలు  రాష్ట్రాన్ని తాకనున్నాయని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్పింది. దక్షిణాదితో పాటు,నైరుతిప్రాంతాల్లో సమృద్దిగా వర్షాలుపడతాయని వెల్లడించింది.