
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలని యోచిస్తోన్న 26 ప్రతిపక్ష పార్టీలు తమ యూనియన్ ఫ్రంట్‌ను బ్రాండ్ చేయడానికి ఇండియా పేరును ఎంచుకున్నాయి. ఈ క్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన ట్విట్టర్ బయో నుంచి "ఇండియా" అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో "భారత్"ని జోడించారు.
విపక్ష కూటమి పేరు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన శర్మ.. బ్రిటీష్ వారు దేశానికి భారతదేశం అని పేరు పెట్టారని, "వలస వారసత్వం" నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో "అస్సాం, భారతదేశం ముఖ్యమంత్రి" అని ఉన్న ట్విట్టర్ బయోలో... ప్రతిపక్షాల ప్రకటన తర్వాత వెంటనే "అస్సాం ముఖ్యమంత్రి, భారత్" గా మార్చుకున్నారు.
"మన నాగరికత వివాదం భారతదేశం, భారత్ చుట్టూ తిరుగుతోంది. బ్రిటీష్ వారు మన దేశానికి భారతదేశం అని పేరు పెట్టారు. వలస వారసత్వాల నుంచి మనల్ని మనం విడిపించుకోవడానికి ప్రయత్నించాలి" అని శర్మ ట్విట్టర్‌లో రాసుకువచ్చారు. "మన పూర్వీకులు భారత్ కోసం పోరాడారు, ఇప్పుడు మనం కూడా భారత్ కోసం పని చేయాలి" అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్.. "ఇండియా పేరుతో అస్సాం సీఎం ఫైర్ అవుతున్నారు. కొత్త మెంటార్ వచ్చారు. ఆయన ఇప్పుడు మనకు స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా అని పేర్లు పెట్టారు. అన్ని రాష్ట్రాల సీఎంలు టీమిండియాలా పనిచేయాలన్నారు. అలాగే ఇండియాకు ఓటెయ్యాలని చెప్పారు. ఇప్పుడు వారు వలస వాద మనస్తత్వమని చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన బాస్(మోదీ)కి చెప్పాలి" కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Our civilisational conflict is pivoted around India and Bharat.The British named our country as India. We must strive to free ourselves from colonial legacies. Our forefathers fought for Bharat, and we will continue to work for Bharat .
— Himanta Biswa Sarma (@himantabiswa) July 18, 2023
BJP for BHARAT