ఇన్ కోవాక్కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదం

ఇన్ కోవాక్కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదం

కరోనాను కంట్రోల్ చేసే మరో వ్యాక్సిన్కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదం తెలిపింది. కొవిడ్-19 నుంచి రక్షణ పొందేందుకు భారత్ బయోటెక్ తయారు చేసిన నాజిల్ వ్యాక్సిన్ను CDSCO ఆమోదించింది. ఈ వ్యాక్సిన్కు భారత్ బయోటెక్ ఇన్కోవాక్గా నామకరణం చేసింది. దీన్ని 18 ఏళ్లు.. ఆ పైబ‌డిన వాళ్లకు అత్యవ‌స‌ర ప‌రిస్థితుల్లో మాత్రమే ఇవ్వాల‌ని CDSCO  సూచించింది. 

ఇన్కోవాక్ గుర్తింపు..

వరల్డ్ వైడ్గా మొదటి దశ, హెటిరోలాగస్ బూస్టర్ డోస్ అనుమతి పొందిన తొలి వ్యాక్సిన్గా ఇన్కోవాక్ గుర్తింపు సాధించింది.  ఇన్ కోవాక్ క్లినికల్ ట్రయల్స్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. మొద‌టి ద‌శ‌, రెండో ద‌శ‌తో పాట..మూడో దశలోనూ సురక్షితమని తేలింది. అంతేకాకుండా ఇన్కోవాక్ ఇమ్యూనిటీ పెంచుతుందని స్పష్టమైంది. ఇన్‌కోవాక్ వ్యాక్సిన్ అనేది ప్రైమ‌రీ 2 డోసులో ముక్కులోప‌ల ఇచ్చే వ్యాక్సిన్.