మా దేశ ప్రయోజనాలే ముఖ్యం : మంత్రి ఎస్‌‌‌‌.జైశంకర్

మా దేశ ప్రయోజనాలే ముఖ్యం : మంత్రి ఎస్‌‌‌‌.జైశంకర్
  • యూఎస్‌‌‌‌తో ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌పై జైశంకర్ 

న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌‌‌‌.జైశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య అగ్రిమెంట్ కుదరాలంటే.. తమ ప్రయోజనాలను యూఎస్ గౌరవించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు. ‘‘అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. ఆ దేశంతో ట్రేడ్ డీల్ మాకు అవసరమే. అలా అని మా దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టలేం. 

మా దేశ ప్రయోజనాలను గౌరవిస్తేనే అగ్రిమెంట్ కుదురుతుంది” అని తేల్చి చెప్పారు. ‘‘ప్రస్తుతం అమెరికాతో సమస్యలు ఉన్నాయి. ట్రేడ్ డీల్‌‌‌‌ చర్చల్లో ఇంకా పురోగతి రాలేదు. అందుకే యూఎస్ మాపై అదనపు టారిఫ్ వేస్తున్నది. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకే టారిఫ్ వేస్తున్నామని అంటున్నది. కానీ రష్యా నుంచి ఇతర దేశాలు కూడా ఆయిల్ కొంటున్నాయి కదా?” అని ప్రశ్నించారు.