బ్యాకాంక్: కెప్టెన్ రాధా యాదవ్ (31 నాటౌట్, 4/19) ఆల్‌రౌండ్ షో చూపెట్టడంతో.. ఇండియా విమెన్స్–ఎ జట్టు.. రైజింగ్ స్టార్స్ టీ20 ఆసియా కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. దినేశ్ వ్రిందా (42) కూడా రాణించడంతో.. శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో శ్రీలంక–ఎపై గెలిచింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన లంక 19.4 ఓవర్లలో 118 రన్స్‌కే ఆలౌటైంది. సంజన కావిండి (31), శష్ని గిమాని (22), సత్య సందీపని (15), హన్సిమా కరుణరత్నే (14) పోరాడారు. ఇండియా బౌలర్లు రాధా యాదవ్‌తో పాటు ప్రేమ రావత్ (2/9), తనుజా కన్వర్ (2/20), సైమా ఠాకూర్ (1/30), మిన్ను మణి (1/21) సమయోచితంగా బౌలింగ్ చేయడంతో లంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
ఇన్నింగ్స్‌లో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో లంకేయులు భారీ స్కోరు చేయలేకపోయారు. ఛేజింగ్‌లో ఇండియా 13.3 ఓవర్లలో 119/5 స్కోరు చేసి నెగ్గింది. నందిని కశ్యప్ (13)తో తొలి వికెట్‌కు 30 రన్స్ జోడించిన దినేశ్ వ్రిందా.. అనుష్క శర్మ (27)తో రెండో వికెట్‌కు 48 రన్స్ జత చేసింది. ఆరు బాల్స్ తేడాలో ఈ ఇద్దరూ ఔటైనా.. చివర్లో రాధా యాదవ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది.
తేజల్ హసబిన్స్ (3), మిన్ను మణి (2) నిరాశపర్చినా.. రాధా చివరి వరకు క్రీజులో ఉండి మరో 39 బాల్స్ మిగిలి ఉండగానే విజయాన్ని అందించింది. రాధాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో సెమీస్‌లో బంగ్లాదేశ్–ఎ విమెన్స్ జట్టు 54 రన్స్ తేడాతో పాకిస్తాన్‌పై నెగ్గింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఇండియా.. బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.
